ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా 
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా… 

ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా 
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా… 

పొద్దుగాల లేవనంటది, దస్సు గారహ్ బారహ్ దాక పండ్తాది 
కూర బువ్వ వండనంటది, పక్కింటి రంగు టివి కాడ ఉంటది 

పొద్దుగాల లేవనంటది, దస్సు గారహ్ బారహ్ దాక పండ్తాది 
కూర బువ్వ వండనంటది, పక్కింటి రంగు టివి కాడ ఉంటది 

తిడతమంటే పడనంటది, కొడతనంటె పోతనంటది 
నేనెట్టా ఏగేదిరో నేనెట్టా ఏగేదిరో హొ హొ హొ 

ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా 
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా హ తక్క … 

అత్తరేసి మస్తుగుంటది ఈడు ఇస్తరేసి సుస్తి అంటది 
బొడ్డుక్రింద చీర కడ్తది, హొరి గోల్కోండ పోదమంటది 

అత్తరేసి మస్తుగుంటది ఈడు ఇస్తరేసి సుస్తి అంటది 
బొడ్డుక్రింద చీర కడ్తది హొరి గోల్కోండ పోదమంటది 

సరసమాడ రాదు అంట, షికారు కొస్తదంట 
ఊరించి చంపుతుందిరో హొ హొ… 

ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా 
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా… 

ముద్దులాడ రాను అంటది, ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది 
ఆ దొంగచూపు చూస్తు ఉంటది, నన్ను చేరమంట సిగ్గు అంటది 

ముద్దులాడ రాను అంటది ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది 
అరె దొంగచూపు చూస్తు ఉంటది, నన్ను చేరమంట సిగ్గు అంటది 

ముట్టకుండ, పట్టకుండ , ముసుగు పెట్టి పండుకుంటె 
నీకు అల్లుడిని ఎట్ట ఇద్దురో బామ్మర్ది 

ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా 
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా… 

ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా 
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా…